7 March, 2026 | 10:57 PM

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

07-03-2026 08:50 PM

మహిళ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  ఎ. వాణి, యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ త్రిపర్ణ, ఆర్పీలు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చూశారు. మహిళా పారిశుద్ధ కార్మికులు  సునీత, లక్ష్మి, ఎట్టమ్మ,  కిష్టమ్మ లను సన్మానించడం జరిగినది.