7 March, 2026 | 10:58 PM

ఆకట్టుకున్న ప్రదర్శనలు

07-03-2026 08:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని చాణిక్య పాఠశాలలో శనివారం టాలెంట్ విస్టా విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ విజ్ఞానం వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయగా ఆకట్టుకున్నాయి. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుతాయని నిర్వాకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకట్ రెడ్డి, వైద్యులు చంద్రిక, ప్రమోదరావు ప్రభాకర్ శంకర్ హరీష్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు