calender_icon.png 12 February, 2026 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

12-02-2026 03:08:33 PM

సర్వం సిద్ధం చేసిన అధికారులు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.

36 వార్డులకు గాను 60 మంది సిబ్బందితో రెండు కౌంటింగ్  హళ్లలో ఒక్కో వార్డు కు గాను ఒక టేబుల్ పై ఐదు మంది సిబ్బంది తో పాటు రాజకీయ పార్టీల నుండి ఒకరు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్ గా ఉండాలని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి మీడియాను కూడా అనుమతించమని  ఎన్నికల ఫలితాల సమాచారం కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందన్నారు.