calender_icon.png 12 February, 2026 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే

12-02-2026 02:03:33 PM

తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష

హైదరాబాద్: తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో ఎగిరేది బీఆర్ఎస్ పార్టీ జెండానే అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కార్పొరేషన్లు చేసిన హైదరాబాద్ బీఆర్ఎస్ దే అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో కొత్త కొలువులు లేవని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు.  పట్టపగలు నగరంలో కాల్పులు జరిపి దొంగతనం చేశారని తెలిపారు. చందానగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ చేశారని పేర్కొన్నారు.