12-02-2026 03:12:58 PM
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత
పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు దుర్వినియోగం కాలేదని కమిషనర్ సుజాత స్పష్టం చేశారు. గురువారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో 47వ డివిజన్లోని 156వ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కేవలం ఖాళీగా ఉన్న 'రిజర్వు' బ్యాలెట్ బాక్సును మాత్రమే వాహనంలో మరిచిపోయినట్లు వివరించారు. దీనిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పోలింగ్ సజావుగా సాగిందని తెలిపారు. భద్రతా ప్రమాణాల మధ్య కౌంటింగ్ కేంద్రానికి బాక్సులను తరలించామన్నారు.