20 May, 2026 | 3:44 AM

ముగిసిన మోదీ నార్వే పర్యటన

20-05-2026 01:53 AM
  1. భారత్ -నార్డిక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు
  2. తదుపరి ఇటలీ రాజధాని రోమ్‌కు ప్రయాణం

ఓస్లో, మే ౧౯: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తన నార్వే పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆ దేశ రాజధాని ఓస్లోలో జరిగిన మూడో భారత్ -నార్డిక్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకా రులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహ్వానించారు. మోదీ అనంతరం ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ తదితర అంశాలపై చర్చలు సాగాయి. గడిచిన పదేళ్లలో నార్డిక్ దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అనంతరం ఓస్లో నుంచి ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్‌కు బయల్దేరివెళ్లారు.