అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
భైంసాజూన్ 17, ( విజయ క్రాంతి): బాసర ముధోల్ మండలంలోని వివిధ అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, అనంతరం ముధోల్ మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయం తో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేం ద్ర భవనానికి శంకుస్థాపన మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల తో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిశుభ్రత ను మరింత మెరుగుపర్చేందుకు చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన నూతన వా హనాలను ప్రారంభించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక గృహ నిర్మాణ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టి ఆధునీకరించిన పోస్టుమార్టం గదులను పునఃప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏ ర్పాటు చేసిన నూతన బోర్వెల్ను కూడా ప్రా రంభించారు.
ముధోల్ లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సే వలు, మౌలిక వసతులు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు అందించడ మే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ప్రధాన లక్ష్యమ ని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






