18 June, 2026 | 2:48 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

18-06-2026 01:48 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులు

మహబూబ్ నగర్ టౌన్ జూన్ 17 : నగరంలోని ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య సిబ్బందితో  ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. స్టాప్ డయేరియా‘కార్యక్రమమును ప్రారంభించి అందరికి ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందుబాటులో ఉంచాలని అన్నారు. 5సం. ల లోపు పిల్లలు డయేరియా గురికాకుండా అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతగురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలందరి ప్రాథమిక ఆరోగ్య బాధ్యత సిబ్బంది పై ఉందని అన్నారు. కార్యక్రమములో డా. శైలజ, డా. శివకాంత్, డా. పులి విద్య, డా. తస్లీమా ఫర్హాత్, డిపిఓ సీతారామ్ గౌడ్,డా. ప్రవీణ్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.