18 June, 2026 | 1:58 AM

బీజేపీ పాలన కార్పొరేట్లకు పండుగ, సామాన్య ప్రజలకు దండగ

18-06-2026 12:28 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం

ఆలేరు, జూన్ 18: 12 ఏండ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు పండగ, సామాన్య ప్రజలకు దండగ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు.  ఆలేరులో 12 ఏండ్ల బిజెపి పాలన - పరిశీలన అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తానని జనరల్ ఖాతా తీయమని మోసం చేశాడన్నారు. 

నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని, కరోనా సమయంలో సరైన ప్రణాళికలు లేక ఐదు లక్షల మంది చనిపోవడానికి,ప్రజల కష్టాలకు  ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, 12 ఏళ్ల బీజేపీ పాలనలో కా ర్పొరేట్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ, పన్నుల మినహాయింపులు ఇచ్చి వారికి రోజు పండుగ చే శారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ ఇక్బాల్, దూపటి వెంకటేష్, మోరిగాడి రమేష్, చంద్రశేఖ ర్, వడ్డేమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, తాళ్లపల్లి, చెన్న రాజేష్, స్వరూప అయిలీ చంద్రకళ, ఘనగాని భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు