విద్యారంగానికి అధిక ప్రాధాన్యత
రాజాపూర్ జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.36 లక్షల మూఢ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.
విద్యార్థుల విజయాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కూడా కీలకమని పేర్కొన్నారు. సింగమా గూడ తండాలో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,సర్పంచులు రేవతి, రాఘవేందర్ నాయక్, మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






