13 April, 2026 | 11:50 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

అచ్చంపేటలో ఎమ్మెల్యే బస్తీబాట.!

12-02-2026 04:15 PM

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని 17వ వార్డు టాంగాపూర్ కాలనీలోని సమస్యలు పరిష్కారం కొరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ మురళి, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.