calender_icon.png 12 February, 2026 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బాలుర పాఠశాలలో కంటి పరీక్షా శిబిరం

12-02-2026 03:16:09 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా గురువారం కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు చూపు లోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) గుర్తించి, అవసరమైన వారికి కళ్లద్దాలు సూచించారు.

ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి డా. సాధన, సిబ్బంది పాల్గొనగా, దోమకొండ డిప్యూటీ డీఎం&హెచ్‌ఓ కార్యాలయానికి చెందిన కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ పరీక్షలు నిర్వహించారు. చిన్న వయసులోనే చూపు సమస్యలను గుర్తించడం ద్వారా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు.