2 May, 2026 | 1:38 PM

‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన

02-05-2026 12:41 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలంలో ప్రభుత్వం సేవలను ప్రజల ముంగిటకే చేర్చే లక్ష్యంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చేపట్టిన ‘ప్రజా దర్బార్’(Praja Darbar) కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 02:30 గంటలకు బచ్చోడు క్లస్టర్ పరిధిలో బచ్చోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. బచ్చోడు, బచ్చోడు తండా, బీరోలు, ఎలువారిగూడెం, పైనంపల్లి, రాజారం, సొలిపురం, మంగలిబండ తండా, జూపేడు, కాకరవాయి, సుద్దవాగు తండా, ఏనుకుంట తండా గ్రామాలకు చెందిన ప్రజలు హాజరుకావచ్చు.

ఈ సమావేశంలో ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు(Applications for New Ration Cards), పెన్షన్ వంటి అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని, అందిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు చర్చలు నిర్వహించనున్నారు. సంబంధిత 12 గ్రామాల ప్రజలు తమ సమస్యల దరఖాస్తులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబారు దయాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.