2 May, 2026 | 2:16 PM

హేమాచలుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

02-05-2026 01:13 PM

మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ  హేమాచల లక్ష్మీనృసింహస్వామిని శనివారం ములుగు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ కోర్టు జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి , ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వీరాస్వామి , దేవాదాయ శాఖ పరిశీలకులు, కురవి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ యర్రంగారి సురేష్ తదితరులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ గోత్రనామాలతో ఆలయ అర్చకులు స్వామి వారికి అర్చన చేసి , స్వామి వారి విశిష్టత గురించి జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు వివరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు  జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు అందించి ఆశ్వీరవచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యురాలు పాయం అనిత తదితరులు పాల్గొన్నారు.