calender_icon.png 13 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5వ వార్డు లో వకీల్ సాబ్‌ దే విజయం...

13-02-2026 04:51:55 PM

నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు

కౌన్సిలర్ ముస్కుల సయేందర్ రెడ్డి

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5వ వార్డులో పోటీ చేసిన విద్యావేత్త సీనియర్ వకీల్ సాబ్, కౌన్సిలర్ ముస్కుల సయేందర్ రెడ్డి విజయం సాధించాడు. 5వ  వార్డులో ఉన్న శ్రీరామ్ నగర్,  కూచిరాజ్ పల్లి బోయిన్ పేట, గొల్లగూడెం, గంగాపురి గ్రామాల ప్రజలు సయేందర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. చదువుకున్న శైలేందర్ రెడ్డి కి ప్రజలు పట్టం కట్టడంతో ఇక ఐదో వార్డు అభివృద్ధి గురించి ఆలోచించి మంత్రి శ్రీధర్ బాబు శ్రీను బాబుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సయేందర్ రెడ్డి తెలిపారు.  కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీనుబాబుకు, తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు, పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.