13-02-2026 04:54:47 PM
15 స్థానాలలో కాంగ్రెస్, 11 స్థానాలలో బి ఆర్ ఎస్ విజయం
బోనీ కొట్టిన బిజెపి
షాద్‌నగర్ ఫిబ్రవరి 13, (విజయక్రాంతి): షాద్‌నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.శుక్రవారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 28 స్థానాలకు గాను 15 స్థానాలు గెలుపొందింది. బి ఆర్ ఎస్ పార్టీ 11 స్థానాలలో విజయం సాధించగా, బీజేపీ పార్టీ ఒక స్థానం గెలుచుకొని భోని కొట్టింది.ఒక స్థానంలో టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
షాద్నగర్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌస్ జానీ, రెండవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బచ్చలి నరేష్, మూడవ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నందారం అశోక్ యాదవ్, నాలుగవ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన వాని పాండురంగారెడ్డి, ఐదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగపాక శిరీష, ఆరవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు నాయక్, ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొప్పునూరి ప్రవీణ్ కుమార్, 8వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీ రెబల్ కాండేట్ సుధీర్, 9వ వార్డు నుంచి బిజెపి అభ్యర్థి పేట అశోక్ , పదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రావణి, 11వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన పిల్లి శారద, 12వవార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దిలీప్, , పదమూడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రిజ్వాన్న బేగం ముబారక్, 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అందే మోహన్, 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరియా బేగం,
16వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన ఒగ్గు జయలక్ష్మి కిషోర్, 17వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సజియా బేగం సర్వర్ పాషా, 18వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతోషి బాయ్, 19 వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన, 20వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన గోపాల్, 21వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన జి టి వసంత, 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన అనిత రఘునాథ్ యాదవ్, 23వ వార్డు నుంచి అగనూరు బస్వం, 24వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగనూరు విశాల విశ్వం, 25వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పెంటయ్య, 26వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన శివ, 27వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మురళీమోహన్ అప్పి, 28వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన చేకూరి లక్ష్మీ ప్రసన్న గెలుపోందారు.