13-02-2026 04:49:51 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చిట్యాల, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిట్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం వెలువడిన ఫలితాలలో చిట్యాల మున్సిపాలిటి 12 స్థానాలకు గాను 9 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా గెలుపొందిన మున్సిపాలిటీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిట్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యతగా చేపడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ అందించిన చిట్యాల పట్టణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలుపొందిన 3 వార్డ్ గాలి యాదమ్మా లింగయ్య, 04 వార్డ్ కోనేటి ఎల్లయ్య, 05 వార్డ్ గుండెబోయిన శ్రీ లక్ష్మి సైదులు. 06 వార్డ్ జెరిపోతుల సత్యనారాయణ, 07 వార్డ్ దేశపాక లత రాజేష్, 08 వార్డ్ కుక్కల మోహన్, 09 వార్డ్ ఏర్పుల పరమేష్, 11 వార్డ్ మునగాల సందీపా,12 వార్డ్ పందిరి గీత రమేష్ లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడల చిన్న మల్లయ్య, గుడిపాటి లక్ష్మీనరసింహ, మారగోని ఆంజనేయులు గౌడ్, వనమా వెంకటేశ్వర్లు, పందిరి శ్రీనివాస్, జనగాం రవీందర్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.