మైనార్టీల సంక్షేమమే టీఆర్పీ లక్ష్యం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
గజ్వేల్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న మల్లన్న
గజ్వేల్, మార్చి 14(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఇఫ్తా ర్ విందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. స్థానిక టీఆర్పీ నాయకులు, మైనార్టీ మత పెద్దల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన మల్లన్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లన్న పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మై నార్టీలకు రావాల్సిన హక్కులు, అవకాశాలు పూర్తిగా అందేలా చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.గజ్వేల్ నియోజకవర్గంలోని టీఆర్పీ నాయకులు, మైనార్టీ మత పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
మైనార్టీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి, సంక్షేమం కోసం తమ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీ ఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం తగ్గిపోయిందని అన్నా రు. నియోజకవర్గంలో ఉన్న ఫామ్ హౌస్‌లకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ ప్రజల మధ్యకి వచ్చి వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడితే మరింత మంచిదని సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పంది స్తూ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాటం చేసే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని మల్లన్న తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు టీఆర్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




