22 March, 2026 | 1:46 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

21-03-2026 10:23 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని, రైతులకు అన్ని విధాల సౌకర్యవంతమైన సేవలు అందించేలా కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ప్రాథమిక సహకార సంఘం ఇంచార్జ్ గణేష్, సీఈఓ నరేష్, డైరెక్టర్లు, రైతులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.