22 March, 2026 | 12:25 AM

పల్లెల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం

21-03-2026 10:21 PM

ఎమ్మెల్సీ దండే విఠల్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దాహేగాం మండలం చంద్రపల్లి గ్రామ సర్పంచ్ కొండపల్లి కస్తూరి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆమెతో పాటు వార్డు సభ్యులు, పలువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంతోనే పల్లెలు నిజమైన అభివృద్ధి దిశగా సాగుతాయన్నారు.

గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ కొండపల్లి కస్తూరి మాట్లాడుతూ... గ్రామ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వేదికగా పనిచేస్తామని చెప్పారు.