నల్లబెల్లం తరలిస్తున్న లారీ పట్టివేత
మహబూబాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి మహబూబాబాద్ కు అక్రమంగా లారీలో నల్ల బెల్లం, పటిక తరలిస్తుండగా మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్, కురవి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా లారీ లో తరలిస్తున్న 8 లక్షల రూపాయల విలువైన 70 క్వింటల్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పటిక, లారీని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్, కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకున్నారు. ఈ సంఘటనకు బాద్యులైన గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్ల విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్ ఐ తాహేర్ బాబా, కురవి ఎస్ ఐ గండ్రాతి సతీష్, ఎస్ ఐ జయకుమార్, పోలీసు కానిస్టేబుళ్లు సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.




