కూతురు పేరుతో తండ్రికి అశ్లీల ఫొటోలు
19-04-2026 01:21 AM
మేడిపల్లి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలతో తన కన్నకూతురు పేరుతో ఇన్ట్‌గ్రామ్ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె తండ్రికి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కాచవానిసింగారం, దివ్య నగర్ ప్రాంతంలో నివాసం ఉండే వ్యక్తి(50)కి తన కూతురి పేరిట నకిలీ ఇన్ట్‌గ్రామ్ అకౌంట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. ఆ వీడియోలను బంధువులకు కూడా పంపిస్తామని బెదిరిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయ గా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






