16-02-2026 12:35:39 PM
తూప్రాన్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్ చైర్మన్(Thoopran Municipal Chairman election) ఎన్నికలలో కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు భారీగా మోహరించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని నినాదాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఆర్పిఎఫ్ పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది. ముందుగా కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు లోపలికి ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఇదే కోణంలో బీఆర్ఎస్ మెజారిటీ అభ్యర్థులు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు మోహరించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అలజడి సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది.