calender_icon.png 16 February, 2026 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్పర్సన్ గా దావా స్వాతి

16-02-2026 12:23:57 PM

  1. వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ..
  2. ఉత్కంఠంగా క్యాంపులు..
  3. లాంచనియంగా ఎన్నిక..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్(Bellampalli Municipal Chairperson), వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరిత వాతావరణం లో జరిగింది.  సోమవార.మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ మనోజ్ సమక్షంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా ఎందుకు అయ్యారు, అదే పార్టీకి చెందిన 17  వార్డు కౌన్సిలర్ రాగం శెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ఎన్నీకయ్యారు.

కాంగ్రెస్ కౌన్సిలర్లు 34 మంది, ఐదుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్ కలిసి ఓటు వేశారు. 21మంది ఓట్లు ఇరువురికి వేశారు.  క్యాంపు నుంచి  ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి మనోజు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. సభ్యులు చేతులు పైకి లేపి ఓటు వేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా ఓటు వేశారు. అంతరం నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్  దావ స్వాతి, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ లతో ప్రత్యేక అధికారి మనోజ్ ప్రమాణ స్వీకారం చేపించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.