calender_icon.png 16 February, 2026 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తా

16-02-2026 12:48:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipality) పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై తాను న్యాయం కోసం ఎన్నికల కమిషన్, హైకోర్టుకు వెళ్తానని  9వ వార్డు నుండి పోటీ చేసి ఓటమిపాలైన బిఆర్ఎస్ అభ్యర్థి సూర శ్యామ్ అన్నారు. ఆయన ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 9వ వార్డులో  కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి నంబర్ పైన 22 ఓట్లు నమోదు చేయించారని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని అధికారులకు తెలిపామని, ప్రజావాణిలో కలెక్టర్ కు పత్రం సమర్పించిన అధికారులు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఫలితంగా తాను నాలుగు ఓట్లతో ఓటమిపాలయ్యానని చెప్పారు. ఒకే ఇంటిలో 22 ఓట్లు ఎలా ఉంటాయో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్, తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సూర శ్యాం వెంట నాయకులు కొయ్యడ అజయ్, అక్బర్, మోసిన్, ఫయాజ్, అనిల్, కాళీ చరణ్ , వెంకటేష్ , రాజు  మహేష్ , పలువురు పాల్గొన్నారు.