10 July, 2026 | 3:19 AM

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్థల సేకరణ

10-07-2026 02:09 AM

కృషి చేసిన డీసీసీ అధ్యక్షునికి ససన్మానం

కామారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతన జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విశేష కృషి చేసిన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్ ను పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ కార్యవర్గ సభ్యు లు, కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం ఏర్పాటుకు డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్  చేసిన కృషి పార్టీ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి, నాయకులుకార్యకర్తలకు ఒకే వేదికను కల్పించడంలో ఈ నూతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , ఈ సన్మానం తనకు వ్యక్తిగతంగా లభించిన గౌరవం కాదని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి, పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషికి లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, మైపాల్ రెడ్డి, ఐరేని సందీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు