10 July, 2026 | 3:18 AM

భూభారతి, రీ సర్వే అవగాహన సదస్సు

10-07-2026 02:08 AM

చేగుంట జూలై 09: పభుత్వం చేపడుతున్న భూభారతి,రీసర్వే కార్యక్రమంలో భాగంగా చేగుంట పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఏ డి,కిషన్, డిఏ రాంరెడ్డి, ఆర్డిఓ బావయ్యా హాజరయ్యారు.

తూప్రాన్ ఆర్డిఓ బావయ్యా  మాట్లాడుతూ, ప్రజలకు,రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాం, భూముల రీసర్వే పై ప్రజలు కూడా సహకరించాలని కొని ఆడారు.మొదటిసారి చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చినా సందర్భంగా ఏ డి కిషన్, డి ఐ, రాంరెడ్డి, ఆర్ డి ఓ బావయ్యా, ట్రైనింగ్ కలెక్టర్ హైమద్ పాషా, తహసిల్దార్ బల్ లక్ష్మి,పాలకవర్గం సభ్యులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించరు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.