10 July, 2026 | 4:24 AM

చదువు ఎంతటి స్థాయికైనా తీసుకెళ్తుంది

10-07-2026 02:11 AM

డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్ అర్బన్, జూలై 9: విద్యార్థి దశ ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో విలువైనదని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని ఎంతటి స్థాయికైనా తీసుకెళ్తుందని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు.

గురువారం వన్ టౌన్ పరిధిలోని రామ్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ మారేపల్లి సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా  విద్యార్థులకు ఉచితంగా నోటుబుక్స్ పుస్తకాల పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే సమాజం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఎల్లప్పుడు అండగా ఉంటామని బాగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమం లోనాయకులు నరేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ జాజీమోగ్గ నర్సింహులు, సిఎం చంద్రమౌలి, ఏర్పుల నాగరాజు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.