6 July, 2026 | 1:20 AM

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కోనరావుపేట అభివృద్ధి: మానుక సత్యం

06-07-2026 12:20 AM

కోనరావుపేట, జూలై 5 (విజయక్రాంతి): మారుమూల మండలమైన కోనరావుపేట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందుతోందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాగారం గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, మహిళా సంఘ భవనానికి రూ.10 లక్షలు, కోనరావుపేట, మల్కాపేట, మర్థనపేట గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

నాలుగు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు మొత్తం రూ.63.50 లక్షలు మంజూరయ్యాయని, సంబంధిత ప్రొసీడింగ్స్ను సర్పంచులు, స్థానిక నాయకులకు అందజేశామని చెప్పారు. మండల అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీ నివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.