6 July, 2026 | 2:20 AM

దైవానుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుంది

06-07-2026 12:18 AM

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ జూలై 5: దైవ అనుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుందని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోనని 21వ డివిజన్ శ్రీనివాస కాలనీ, శ్రీ పోచమ్మ  కంఠశిల(బొడ్రాయి) పునఃప్రతిష్టా మహోత్సవనికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డిపాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గొప్ప ఆలోచనలతో నగరాన్ని ఆదర్శ నియంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

అందరం ఐక్యంగా ఉండి ప్రజాపాలనకు అండగా నిలబడదామని సూచించారు. ప్రతి పనిలోనూ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  గుండా సంతోష్, పెద్దగోళ్ళ నర్సిములు, తిరుమల వెంకటేష్, మున్నూరు రవి, గుండా మనోహర్, ఎర్ర లక్ష్మణ్, సి. శ్రీనివాసులు, కాలనీ పెద్దలు, ఆనంద్ రెడ్డి, నాగేశ్వర్, శేఖర్, చంద్రనాయక్, సురేష్ రెడ్డి, వెంకటేష్, చరణ్,  తదితరులు పాల్గొన్నారు