బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి కందాళ ఆర్థిక సాయం
02-05-2026 03:16 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం గోరిలపాడుతండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బానోత్ సుధీర్ కుటుంబానికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రూ.30వేలు అర్థిక సహాయం అందించారు. సుదీర్ తండ్రి "జానికిరామ్ "దశ-దిన కర్మ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ. 30వేలు ఆర్థిక సహాయాన్ని మండల అధ్యక్షులు వేముల వీరయ్య ఆధ్వర్యంలో కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా,కందాళ ఉపేందర్ రెడ్డి కి ఆపదలో అండగా ఉన్నందుకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా తమకు తెలియజేయవచ్చని మండల పార్టీ నాయకులు పేర్కొన్నారు".






