18 June, 2026 | 1:58 AM

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం

18-06-2026 12:32 AM

ఎమ్ ఈ ఓ లక్ష్మణ్ నాయక్ 

వేములపల్లి, జూన్ 17: ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించడం అభినందనీయమని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు. బుధవారంమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రావుల పెంటలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుమ్మల స్వాతి తన కుమార్తెను ఆరో తరగతిలో జడ్పీహెచ్‌ఎస్ రావులపెంట పాఠశాలలో అడ్మిషన్ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్య లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగైన విద్యను  అందిస్తున్నాయని, రావులపెంట హై స్కూల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు నాణ్యమైన విద్యాభ్యాసం పొందగలుగుతున్నారనారు.

పదవ తరగతి విద్యార్థులు 100% మంచి మార్కులతో పాసైయ్యారు. చిట్యాల శివ మండల టాపర్ గా 557 మార్కులతో బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించడం జరిగింది.మా పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థిని నిత్యలేఖకు ఎన్‌ఎంఎంఎస్ కు సెలెక్ట్ కావడం జరిగిందని అన్నారు.ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నందున తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం గుమ్మల స్వాతికి అభినందనలు తెలిపారు.