ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయండి సారు..
సర్పంచ్ అనితకృష్ణసాగర్ వినతి
ఎర్రవల్లి ఏప్రిల్ 17: ఎర్రవల్లి మండలం ఏర్పడి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్ అనితకృష్ణసాగర్ బుదవారం గద్వాల్ డి.ఎం. హెచ్. ఓ కార్యాలయంలో జిల్లా వైద్య పోగ్రామ్ అధికారి డా. అస్ఘర్ అలీ నీ కలిసి వినతి పత్రం సమర్పించారు.
మండల ప్రజలకు అత్యవసర వైద్యం, ప్రసూతి సంరక్షణ, చిన్నపిల్లల టీకాల కోసం20 నుంచి 30 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యం లేక, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సరైన సమయంలో చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు.
మండల కేంద్రంలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బంది, మందులు కేటాయించాలని సర్పంచ్ కోరారు. ఏర్పాటుపై జిల్లా వైద్యాధికారి డా. అస్ఘర్ అలీ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణసాగర్, దశరథం సాగర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






