18 June, 2026 | 1:55 AM

వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

18-06-2026 12:30 AM

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, జూన్ 17: వ్యవసాయ రంగం అభివృద్ధి పరచడమే కాకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రె స్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బుధవారం మిర్యాల గూడ సహకార సంఘం నందు రైతులకు జీలుగు జనుముల విత్తనాలతో పాటు ఎరువులను అందించి మాట్లాడారు.

రైతులు సహకార సంఘం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న విత్తనాలను ఎరువులను వాడి సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు డైరెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.