18 June, 2026 | 3:09 AM

ఒరియా పిల్ల వస్తోంది..

18-06-2026 01:58 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కల్యాణ్’. ఈ చిత్రాన్ని జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌నకు మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడిక మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగ ంగా ఈ సినిమాలోని తొలిగీతం ‘ఒరియా పిల్లా..’ను జూన్ 20న రిలీజ్ చేయనున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కథానాయకుడు శ్రీవిష్ణు, కథానాయకి మహిమా నంబియార్ మధ్య కెమిస్ట్రీ, లవ్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ డీవోపీగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.