ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను పరిశీలన
మద్నూర్ ఏప్రిల్ 22(విజయక్రాంతి); మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే గారు, పనులు నాణ్యతతో పాటు వేగంగా కొనసాగాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
అలాగే భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్యా వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ,ఈ పాఠశాల నిర్మాణం పూర్తి అయితే ప్రాంతీయ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాంతారావు తో పాటు డిసిసి అధ్యక్షుడు మల్లికార్జున మరియు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు మరియు మద్నూర్ మండల పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు






