23 April, 2026 | 4:18 AM

కదలని ఆర్‌టీసీ బస్సులు

23-04-2026 01:16 AM

అద్దె బస్సులను నడిపించే యత్నం

హుజురాబాద్ లో పోలీసులతో వాగ్వాదం

అదుపు తప్పిన అద్దె బస్సు

ప్రయాణికులకు స్వల్ప గాయాలు

కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు.. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం తెల్లవారుజాము నుండి బస్సులు నిలిచిపోయాయి. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా 11 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు సంబంధించి 3000 నంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసులు ప్రభుత్వానికి అందజేశారు. 31 డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం ముందు ఉంచడంతో ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిచింది. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీలో సమ్మె అనివార్యమైంది.

సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించారు. సమ్మె వల్ల విద్యార్తులు, ఉచిత బస్సు ప్రయనికులైన మహిళలు  ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు అన్నారు. రీజియన్ వ్యాప్తంగా 333 అద్దె బస్సులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడిపించే ప్రయత్నం చేయగా పలుచోట్ల కార్మికులు అడ్డుకున్నారు.. సంస్థ పరంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించినా సమ్మె ప్రభావం కనిపియించింది.

ప్రమాదానికి గురైన అద్దె బస్సు

కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంకు గురయింది.*అద్దె బస్సులో కండక్టర్ లేకపోవడంతో టికెట్ ఇస్తు డ్రైవింగ్ చేయడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులను నడిపిస్తున్నారు. కరీంనగర్ టు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ కు వెళ్తుండగా కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. 

పోలిసుల ఓవర్ యాక్షన్

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కు పిలుపునివ్వగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కార్మికులు డిపోకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు డిపోకు చేరుకొని బస్సులను బలవంతంగా పంపించెందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దింతో కార్మికులకు, పోలీసులులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.