ఆర్‌ర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆర్ ర్టీసీ డిపో వద్ద ఆర్ ర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి మాజీ మంత్రి బిఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ ర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావటం బాధాకరం ఏ కార్మికుడు కూడా స మ్మెకు పోవాలని కోరుకోడన్నారు.తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు అండగా ఆర్ ర్టీసీ కార్మికులు నిలిచారు.గతంలో కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్ ర్టీసీ సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేస్తాను అని తెలిపారు. కానీ అంతలోనే ఎలక్షన్ రావడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఆర్ ర్టీసీ కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకుంటాం అని తెలిపిందని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మహాలక్ష్మి పథకం అమలు అవుతున్నదానికి కారణం ఆర్ ర్టీసీ సంస్థ అని,ఐదు డి ఏ లు పెండింగ్ లో ఉ న్నాయి 2021,2025 పి ఆర్ సి అమలు చేయాలన్నారు.ఆర్ ర్టీసీ నీ బలోపేతం చే యాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, బస్ ల సంఖ్య పెంచకుండా మహిళలకు మహా లక్ష్మీ పథకం ను నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి కి జ్ఞానం ఉందా అని ద్వజమెత్తారు.మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను ప్రభుత్వం చదువుకోవాలి.
సమ్మె పరిష్కారం లభిస్తుందని అనుకున్నాం మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది.మేము మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం.ఆర్ ర్టీసీ సంస్థ కి నిధులు పూర్తిస్థాయి లో విడుదల చేయాలి.ఆర్ ర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా అపాయింట్ డే ప్రకటించాలి ఈ ప్రభుత్వంలో సమ్మె అనివార్యం ఐనదని,ఇవాళ యూనియన్ ల పునరుద్ధరణ అవసరం పడ్డదన్నారు.రవాణా సదుపాయాలు మెరుగుపర్చాలి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు నేను ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల గురించి పాటుపడుతాను స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో బిఆర్‌ఎస్ నాయకులు, ఆర్ ర్టీసీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.






