11 June, 2026 | 5:36 PM

ర్యాపిడ్ రేస్కీ బృందం భవనం ప్రారంభం..

11-06-2026 04:19 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలో బెల్లంపల్లి ఫారెస్ట్ కాంప్లెక్స్ లో నిర్మించిన ర్యాపిడ్ రెస్క్యూ టీం భవనం ను  బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్ ప్రారంభించారు. అదేవిధంగా  ర్యాపిడ్ రెస్క్యూ టీం వాహనంను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేంజ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ  కార్యక్రమంలో FDO, బెల్లంపల్లి, మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, ప్రజాప్రతినిధులు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.