ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయాలి
31-07-2026 02:28 AM
ఆత్మకూర్, జూలై 30: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
గురువారం ఆత్మకూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మకూర్, అమరచింత మండలాల ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్తో కలిసి సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి మహిళా సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారుల మంజూరును నిబంధనల ప్రకారం రద్దు చేసి, అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని స్పష్టం చేశారు.






