11 June, 2026 | 5:12 PM

Breaking News

విచ్చలవిడిగా నాసిరకం సేంద్రీయ ఎరువుల విక్రయం

11-06-2026 04:22 PM

అసలు నకిలీ తెలియక రైతన్న అయోమయం.

బోథ్,జూన్ 11(విజయక్రాంతి): రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కలిగిస్తుంటే ఇదే అదునుగా భావించిన కొంతమంది కేటుగాళ్లు నాసిరకమైన సేంద్రియ ఎరువులను రైతులకు అంట కడుతున్నారు. దీంతో రైతులు నష్టపోయే ఆస్కారం ఉంది.

ముందుగా బుకింగ్ ఆ తర్వాత డెలివరీ... 

గ్రామీణ ప్రాంతాల రైతులతో పాటు మండల కేంద్రంలోని రైతులకు సహితం కొంతమంది సేంద్రియ ఎరువులను పంట కడుతున్నారని తెలిసింది. సేంద్రియ ఎరువులు ఎక్కడ తయారవుతున్నది అనే వివరాలు ఉండకపోగా వాటిని ఎక్కడినుండి తీసుకువస్తున్నారు అనే విషయం సైతం తెలియకుండా పోతున్నది. తెల్లవారుజామున కొంతమంది మధ్యవర్తులు నేరుగా రైతుల ఉండవద్ద పంట చేల వద్ద వీటిని డెలివరీ చేసి వెళ్ళిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం లక్షల్లో కొనసాగుతుందని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి సేంద్రియ ఎరువుల విగ్రహించేవారు స్థానికంగా ఓ గోడౌన్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయ శాఖ నుండి అనుమతి పొంది విక్రయించాల్సి ఉంది.కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే వీటిని రైతులకు అంటగడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఈ విషయమై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మా దృష్టికి రాలేదు ఏవో రవితేజ.

సేంద్రీయ ఎరువుల విక్రయాలపై ఎవరు ఫిర్యాదు చేయలేదని ఈ విషయం తమ దృష్టికి రాలేదని బోత్ మండల వ్యవసాయ శాఖ అధికారి రవితేజ తెలిపారు. అక్రమ వ్యాపారం పై దృష్టి సారిస్తామని ఎక్కడ ఈ విధమైన సేంద్రియ ఎరువులు విక్రయించిన తమకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోపియంగా ఉంచుతామన్నారు