29 June, 2026 | 2:04 AM

ఓల్డ్ బోయిన్‌పల్లిలో శ్రీ శివదుర్గ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

29-06-2026 01:10 AM

పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముప్పిడి గోపాల్

సికింద్రాబాద్, జూన్28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకుడు దండగుల యాదగిరి ఆధ్వర్యంలో బోయిన్ పల్లి లో ఆదివారం శ్రీ శివ దుర్గ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టిపిసిసి ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముప్పడి గోపాల్ తో పాటు స్థానిక నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముప్పడి గోపాల్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న  సంతర్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులను రమేష్ అభినందించారు.అనంతరం ఆలయ నిర్వహకులు దండగులయాదగిరి ముఖ్య అతిథులను శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్, పుష్పరెడ్డి,లక్ష్మయ్య,శివ,సతీష్,షాహనషా, రాము,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..