29 June, 2026 | 3:16 AM

ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

29-06-2026 02:01 AM

ఘట్‌కేసర్, జూన్ 28 (విజయక్రాంతి) : భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) లో భాగంగా రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక మేడ్చల్ శాసనసభ్యులు  చామకూర మల్లారెడ్డి  ఆదేశానుసారం ఘట్కేసర్ డివిజన్ ఎన్ ఎఫ్ సి నగర్ లో 328, 329 బూతులలో  బి ఎల్ ఓ లు ఎమ్యునరేషన్ ఫారమ్స్ ను పంపిణీ చేస్తున్న  కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లుగా ప్రజలకు కొన్ని సలహాలను సూచిస్తూ బి ఎల్ వో లకు సహకరించడం జరిగింది.

ఎస్ ఐ ఆర్ విజయవంతనికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చేర్మెన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, చందుపట్ల వెంకట్ రెడ్డి, నాయ కులు లింగస్వామి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, బిఎల్‌ఓలు శివ సాయిరాజ్, సజల, శశికల, బిజెపి ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, పడిగం వీరేషం, గీత పాల్గొన్నారు.