29 June, 2026 | 3:16 AM

పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్ విజయలక్ష్మి

29-06-2026 02:02 AM

మొయినాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ‘నిండు జీవితానికి రెండు చుక్కలు‘ అనే నినాదంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ పల్లగొల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.