చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
29-06-2026 01:10 AM
రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్లలోపు చిన్నారులందరికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ డివిజన్ పరిధి శ్రీరాం నగర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అయన పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికి కచ్చితంగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్తకుర్మ శివకుమార్, అంగన్‌వాడీ టీచర్ స్వప్న, ఏఎన్‌ఎం పద్మ, నాయకులు మేతరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.






