అందుబాటులో ఉంటూ సేవలందిస్తేనే గుర్తింపు
ఏసీపీ జానకీ రెడ్డి
ఆమనగల్లు, జూన్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించినప్పుడే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని మహే శ్వరం ఏసీపీ జానకీ రెడ్డి అన్నారు. ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్త్స్రలు సీతారాం రెడ్డి, మురళీధర్ రెడ్డిల వీడ్కోలు సభ ఆదివారం స్థానిక శుభం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ జానకీ రెడ్డి, పదవీ విరమణ పొందిన అధికారుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.
పోలీస్ శాఖలో వారు ప్రదర్శించిన క్రమశిక్షణ, అంకితభావం యువ పోలీసు సిబ్బందికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. వారి విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఆమనగల్లు ఎస్హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, మహేశ్వరం ఎస్హెచ్‌ఓ రాఘవేందర్ రెడ్డి, కందుకూర్ ఎస్హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, కడ్తాల్ ఎస్హెచ్‌ఓ సాయిరెడ్డి, తలకొండపల్లి ఎస్హెచ్‌ఓ జానకీ రాం రెడ్డితో పాటు పలువురు ఎస్త్స్రలు, పోలీస్ సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు.






