07-02-2026 12:56:31 AM
కుల సంఘాలకు నగదు ఎర
జనరల్, చైర్మన్ అభ్యర్థి స్థానాల్లో అధిక ప్రభావం
కనిపించని నిఘా వ్యవస్థ
ఓటర్లలో అసంతృప్తి
నాగర్ కర్నూల్ / కల్వకుర్తి ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరు లై పారుతుంది. ఎన్నికల ప్రచారం అత్యంత తక్కువ సమయం ఉండడంతో గెలుపోటములపై ప్రభావం పొంచి ఉందనే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. తమ వెంట తిరిగేందుకు ఒక్కొక్కరికి వెయ్యి నుండి రెం డు వేల చొప్పున పంపిణీ చేస్తూ ఇతర గ్రా మాల నుండి జనాన్ని సమీకరిస్తున్న పరిస్థితి. మద్యం, కల్తీ కల్లు, టిఫిన్ భోజనం బిర్యాని వంటివి పంపిణీ చేస్తున్నారని చర్చ జరుగుతుంది.
నాగర్ కర్నూల్ కల్వకుర్తి కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జనరల్ స్థానాలు, చైర్మన్ అభ్యర్థులు బరిలో ఉన్న వార్డుల్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామం గా మద్యం, కల్తీ కల్లు సరఫరా జరుగుతోందని అయినా సంబంధిత అధికారులు ని ఘా వ్యవస్థ పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికార వ్యామోహంతో మళ్లీ గెలుపొందాలనే లక్ష్యంతో పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంఫై వారి ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 24వార్డులకు గానూ అత్యధికంగా రెండు సార్లు వరుసగా గెలుపొందిన హ్యాట్రిక్ కోసం తాపత్రయ పడుతున్న వారే అధికం. ఇందులో నూ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, అక్ర మ కట్టదాలకు సపోర్ట్ నిలిచి సెటిల్మెంట్ లతో అక్రమార్జనకు పాల్పడిన వారిని ప్రస్తు తం ఓటమి భయం వెంటాడుతోంది. ఒక్కో ఓటుకు ధర నిర్ణయించి గెలుపొందాలని ప్ర ణాళికలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. కల్వకుర్తిలో మొత్తం 22 వార్డులు ఉండగా అధిక శాతం అభ్యర్థులు గతంలో కౌన్సిలర్లు గా పనిచేసిన వారే కావడం గమనార్హం.
గతంలో పదవులు అనుభవించినప్పటికీ, కాలనీల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఈసారి ఓటర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమాక పడుతున్నారు. డోర్ టూ డోర్ ప్రచారం చేస్తూ రో జువారీ కూలీలను వెంటబెట్టుకొని గుంపులుగా తిరుగుతున్న అభ్యర్థులు రాత్రి వేళల్లో ఒక్కో ఇంటికి విలువైన మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చి వరి దశలో ఓటుకు రూ.2,000 నుంచి రూ. 5,000 వరకు ఇవ్వాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ నిఘా వ్యవస్థ సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.