calender_icon.png 7 February, 2026 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండికి హిందూ జపం తప్ప.. అభివృద్ధిపై ధ్యాస లేదు

07-02-2026 12:55:38 AM

  1. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ద్విగుణీకృత అభివృద్ధి

ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, మేడిపల్లి సత్యం 

ముకరంపురా, ఫిబ్రబరి6(విజయక్రాంతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కొం డగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ఒక్క పైసైనా తెచ్చారా అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జ్ నాయిని రాజేందర్ రెడ్డితోచొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వే శంలో మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలో ఉన్నందున, కరీంనగర్ కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ద్విగుణీకృత అభివృద్ధి సాధ్యమవుతుం దని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నాయకులు కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు వారే బీజేపీలో చేరి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

స్మార్ట్ సిటీ నిధుల్లో రాష్ట్ర వాటా ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోకూడదని, ఎ న్నికల సమయంలో దేవుళ్ల పేరుతో ప్రజల ను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.ప్రధాని మోడీ స్వ యంగా వేములవాడకు వచ్చినా నయా పై సా మంజూరు చేయలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలు అంతర్గత ఒప్పందంతో కరీంనగర్ను భ్రష్టు పట్టించాయని ఆరోపించారు.

గత బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు భూకబ్జా లు, దోపిడీలతో కోట్లు గడించి, ఇప్పుడు కం డువాలు మార్చి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, మారినవి కండువాలే తప్ప వారి బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్య క్తం చేశారు. సమావేశంలో సుడా చైర్మన్ కో మటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇంచార్జ్ ఉట్కూరు నరేందర్ రెడ్డి,

గ్రంథాలయ చైర్మ న్ సత్తు మల్లేశం, ఆర్టిఏ మెంబర్ పడాల రా హుల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మో హన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, మా జీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆ కారపు భాస్కర్ రెడ్డి, ఎండీ తాజ్, సిరాజు హుస్సేన్, వెన్న రాజ మల్లయ్య, కుంభాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.