calender_icon.png 7 February, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌లదే ఫేవికాల్ బంధం

07-02-2026 12:56:59 AM

  1. కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్ క్రైం , ఫిబ్రవరి6(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి గ్రామపంచాయ తీ ఎన్నికలు జరిగితే మున్సిపాలిటీ లలో మీ టింగ్ పెట్టారు... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే గ్రామాల్లో సమావేశాలు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు బోయిన పల్లి వినోద్ కుమార్‌కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

శుక్రవారంబీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి బూతులు మా ట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్ ది ఫేవికా ల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందనిసీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి సభలో నిన్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండు పీసీ ఘోష్ కమీషన్ రిపోర్ట్ ఇచ్చింది..

కేంద్ర ప్ర భుత్వం సప్పుడు చేయడం లేదని మాట్లాడినారు..ఘోష్ కమీషన్ ఇచ్చిన రిపోర్టు పైన కేసీఆర్, హరీష్ రావు, కొందరు చీప్ ఇంజనీర్లు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడం జ రిగిందన్నారు.నేషనల్ హేరాల్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ రేండున్నరేళ్లుగా సాగుతున్న ఇప్పటి వరకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఎందుకు అరెస్టు చే యడం లేదు.. ఈ వ్యవహారంలో మోడీ, సోనియాగాంధీ ఇద్దరు ఒక్కటేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాట లు మాట్లాడటం ఏంటన్నారు.

ఇయ్యల ప్ర పంచమంతా రాజకీయంగా సీఎం రేవంత్ రె డ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కటేనని అందుకే ఇయ్యల కరీంనగర్ లో మీటింగ్ పెట్టకుండా గుములాపూర్ లో సమావేశం పెట్టారన్నారు.కరీంనగర్ కార్పోరేషన్ లో ఎన్నికలు జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ లో మీటింగ్ పెట్టె దమ్ము లేదని ప్రజ లు అనుకుంటున్నారన్నారు.బీఆర్‌ఎస్ అంటే కాంగ్రెస్, బీజేపీ లకు భయం పట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తా రు.

మరో రెండున్నరేళ్ల కాలంలో తెలంగాణ లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోతుందనికరీంనగర్ లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు.