4 August, 2026 | 2:34 AM

‘సుప్రీం’ జడ్జీల పెంపు బిల్లుకు ఆమోదం

04-08-2026 01:28 AM

లోక్‌సభలో అయోధ్య విరాళాల చోరీపై ప్రతిపక్షాల నినాదాల మధ్య పాసైన బిల్లు

రాజ్యసభలో ఎంఎస్‌ఎంఈ బిల్లుకు ఆమోదం

బిల్లులు పాసైన వెంటనే ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 3: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రెండు బిల్లులు పాస్ అయ్యాయి. లోక్‌సభలో సుప్రీ ంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు సవరణ బిల్లు, రాజ్యసభలో చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) బిల్లు ఆమోదం పొందాయి. ఈనీట్ లీక్, రామమందిర విరాళాల చోరీపై ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

రాజ్యసభలో ఎంఎస్‌ఎంఈ బిల్లుకు ఎలాంటి నిరసనలు చోటుచేసుకో కుండా సజావుగా ఆమోద ముద్ర పడింది. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ప్రారంభం కాగానే విపక్షాల నిరసనలతో హోరెత్తాయి. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని విప క్ష సభ్యులు పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీ ంతో ఉదయం ప్రారంభమైన రెం డు సభలు తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడ్డాయి.

మధ్యాహ్నం సభలు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే రకమైన ఆందోళన లు కొనసాగాయి. రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ రంగానికి చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించడం, వివాదాలను త్వరగా పరిష్కరించడం బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

2014లో రూ.10 లక్షల కోట్లుగా ఉన్న రుణ పరిమితి ప్రస్తుతం రూ.38.5 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ రంగానికి పూర్తి అండగా ఉం టుందని స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగిస్తూనే బిల్లుపై చర్చకు సహకరించలేదు. ఈ క్రమంలో బీజేపీ సభ్యురాలు సుమిత్రా బాల్మీక్ మాట్లాడారు. ప్రధా ని మోదీ నాయకత్వంలో చిన్న పరిశ్రమల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపా రు. విపక్షాల నినాదాల నడుమే రాజ్యసభ ఈ బిల్లును మౌఖిక ఓటింగ్ ద్వారా ఆమోదించింది.

సభ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లా డుతూ, విపక్షాలు బిల్లును అడ్డుకోవడం విచారకరమని పేర్కొన్నారు. లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మినహా ఇత ర జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. దీనివల్ల మొత్తం జడ్జీల సంఖ్య 38కి చేరుతుంది. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్యే ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ ఈ బిల్లుకు ఆమో దం తెలిపింది. బిల్లులు ఆమోదం పొందిన వెంటనే ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.